Thursday, December 11, 2008

చాలునయా.. చాలునయా...

పల్లవి:
చాలునయా.. చాలునయా...
నీ కృప నాకు చాలునయా ||2||
ప్రేమమయుడివై ప్రేమించావు కరుణామయుడివై కరుణించావు ||2||
తల్లిగా లాలించి తండ్రిగా ప్రేమించే ||2||
ప్రేమా కరుణా నీ కృప చాలు ||2||
||చాలునయా||

చరణం:
జిగట గల ఊభిలో పడియుండగా
నా అడుగులు స్థిరపరచి నిలిపితివయ్యా ||జిగట||
ఇస్సోకుతో నన్ను కడుగుము ఏసయ్యా
హిమముకంటేను తెల్లగా మార్చయ్యా
నీకేమి చెల్లింతూ నా మంచి మెస్సయ్యా
నా జీవితమంతా అర్పింతు నీకయ్యా
ప్రేమా కరుణా నీ కృప చాలు ||2||
||చాలునయా||

చరణం:
బంధువులు స్నేహితులు త్రోసేసిన
తల్లిదండ్రులే నన్ను వెలివేసిన ||బంధువులు||
నన్ను నీవు విడువనేలేడయ్య
మిన్నగా ప్రేమించి రక్షించినావయ్యా
నీకేమి చెల్లింతూ నా మంచి మెస్సయ్యా
నీ సాక్షిగా నేను ఇలా జీవింతునయ్యా
ప్రేమా కరుణా నీ కృప చాలు ||2||
||చాలునయా||

1 comment:

Anonymous said...

Hi sravan please seeing mana website