Sunday, December 14, 2008

అవధులు లేని ఆనందం వెల్లువగా పొంగిన రోజు...

పల్లవి:
అవధులు లేని ఆనందం వెల్లువగా పొంగిన రోజు
ఉరకలు వేసే ఉత్సాహం ఉల్లమునే నింపిన రోజు ||2||
ఇది నీ పుట్టిన రోజు... ||2||
మనసైన వేడుక రోజు... ||2||
||అవధులు||
"Happy Birth Day To You..."

చరణం:
గడచిన సంవత్సరములు కాచిన దేవుని స్తుతియించాలి
ఎడబాయక నిన్ను కాపాడిన ప్రభు ప్రేమను మదినుంచాలి ||2||
ఆయన చేసిన మేలుల బట్టి కృతజ్ఞత చూపించాలి ||2||
జీవితమంతా ఏసునీ కొరకు సాక్షిగా జీవించాలి... ||2||

||అవధులు||
"Many Greetings To You..."

చరణం:
రాబోయే వత్సరములు కృపయు క్షేమం నీతో రావాలి
ఈ లాంటి పుట్టిన రోజులు నీవేన్నో చేసుకోవాలి... ||2||
నీదు జీవితం అనేకులకు దీవెన కరమై సాగాలి ||2||
నీ గృహమే స్వర్గముగా ధర లో సిరులతో తులతూగాలి... ||2||

||అవధులు||
"May God Bless You Dear..."

చరణం:
అడుగు పెట్టిన ప్రతి స్థలములలో ఆశీర్వాదం కలగాలి
మొదలుపెట్టిన పనులన్నిటిలో విజయం తో వెలగాలి ||2||
ఉన్నతమైన శికరాలెన్నో నీవదిరోహించాలి ||2||
చదువులు పదవులు వ్యాపారములో వృద్ధి ని సాదించాలి... ||2||

||అవధులు||
"Happy Long Life To You..."

No comments: