Showing posts with label బాలు. Show all posts
Showing posts with label బాలు. Show all posts

Thursday, December 11, 2008

బంగారు బొమ్మ నీవమ్మా...

పల్లవి:
బంగారు బొమ్మ నీవమ్మా వధువు సంగమా రావమ్మా ||2||
శృంగార ప్రభువు ఏసమ్మా వరుడు క్రీస్తు గొరియ పిల్లమ్మా ||2||
||బంగారు బొమ్మ||

చరణం:
ప్రత్చ్సాతపమే పెళ్లి చూపులమ్మా
పాప క్షమాపనే నిర్చితార్ధమమ్మా
విరిగిన మనస్సు వరుని కట్నమమ్మా
నలిగిన హృదయమే పెళ్లి పత్రికమ్మా
గొరియ పిల్ల రక్తములో తడిసిన
పవిత్ర కన్యవై నిలిచేవమ్మా ||2||
||బంగారు బొమ్మ||

చరణం:
కొరడా దెబ్బలే పెళ్లి నలుగమ్మా
అసూయా ద్వేశాలే సుగంధ ద్రవ్యమమ్మా
నెత్తుటి దారాలే పెళ్లి చీరమ్మా
ముళ్ళ కిరితమే పెళ్లి ముసుగమ్మా
ప్రకాశమయమై నిర్మలమైన
పరిశుద్ధుల క్రియలై నడిచేవమ్మా ||2||
||బంగారు బొమ్మ||

చరణం:
కల్వరి కొండే పెళ్లి పీటమ్మా
దేవుని దూతలే పెళ్లి సాక్షులమ్మా
సిలువ దండమే పెళ్లి సూత్రమమ్మా
దూషణ హేలనే పెళ్లి అక్షింతలమ్మా
సువర్ణమయమై స్వచ్చమైన
స్పటికమువోలే మెరిసేవమ్మా ||2||
||బంగారు బొమ్మ||

ఉన్నపాటున రాలేక పోతున్నాను...

పల్లవి:
ఉన్నపాటున రాలేక పోతున్నాను
కన్న పాపము మొయలేకపోతున్నాను
నేను కన్న పాపము మోయలేక తల్లడిల్లుతున్నాను
తల్లడిల్లుతున్నాను...
రెప్ప పాటున నీ కృప చాలును
నీ రెక్కల చాటున చేరిపోదును
||ఉన్నపాటున||

చరణం:
ఉన్నవారిని కొట్టి లేని వారికి పెట్టి
సమసమాజ నిర్మానమని మానవ రాజ్య స్థాపనని
చీకటిలోకి వెళ్ళిపోయాను
అరణ్య రోదనై మిగిలిపోయాను
అయ్యో నేనెంత దుర్మార్గుడను
అయ్యో నేనంత దౌర్భాగ్యుడను
||ఉన్నపాటున ||

చరణం:
దివినే విడిచిపెట్టి భువికే దిగివచ్చి
దైవ మానవ సమసమాజమని దేవుని రాజ్య స్థాపనని
పాప క్షమకై నీ రక్తము చిందించి
శాప విముక్తికై మృతినే గెలిచితివి
అయ్యా నీవెంత నిజమానవుడవు
అయ్యా నీవంత నిజ దేవుడవు
||ఉన్నపాటున||

ఏ పాట పాడెను ఏసయ్యా

పల్లవి:
ఏ పాట పాడెను ఏసయ్యా నీ పుట్టిన రోజు తలచుకొని
ఏ మాట పలికెను మెసయ్యా నీ పుట్టుక కష్టం తెలుసుకొని ||ఏ పాట||
గుండెల దుఖ్ఖము నిండిపోగా గుండె గొంతుక పెనుగులాడగా
|| పాట పాడెను ఏసయ్యా||

చరణం:
కన్య మరియా గర్భవతియై దీనురాలి ధన్యురాలై ||2||
సంకెళ్ళ కన్నీళ్ళ కట్టేరలో లోక రక్షకుని కన్నతల్లియై
పాడేనా ఈ జోలపాట క్రిస్టమస్ లో ఆ సిలువ పాట ||2||
|| పాట పాడెను ఏసయ్యా||

చరణం:
పశువుల పాకే పాపిస్తులోకమై గూంగలి దుప్పటి పాపపు ముసుగై ||2||
పశువుల తొట్టె మోసమైన మనస్సు పోట్టిబత్తలే మరణ పాసములై
పాడేనా ఈ జోలపాట క్రిస్టమస్ లో aa సిలువ పాట ||2||
|| పాట పాడెను ఏసయ్యా||

తంభురతో సితారతో నాట్యముతో స్తుతియించేదను

పల్లవి:
తంభురతో సితారతో నాట్యముతో స్తుతియించేదను ||2||
ఆరాధ్యదైవం నీవేయని నా స్తోత్రగీతం నీదేననీ ||2||
||తంభురతో||

చరణం:
ఉదయమున నే మేల్కొని నీకు స్తోత్రగానము చేసెదను
నీవు చేసిన మేలును తలచి క్రుతాజ్నతాస్తుతులు చెల్లింతును ||2||
శ్రమల గూండా వెళ్లినను చేయి విడువని దేవుడు
వ్యాధి బాదలేనైనా స్వస్థపరచును నా యేసు
ఆత్మతో సత్యము తో ఆరాదించెద నా యేసుని ||2||
||తంభురతో||

చరణం:
పాప ఊభినుండి యేసు నన్ను కరుణతో విడిపించెను
దప్పిగొన్న నాకు యేసు సేదదీర్చి నడిపించెను ||2||
ప్రభువు ప్రేమ నుండి నన్ను విడదీయలేరేవ్వరు
క్రీస్తునందు ఏకమైతిని నేనెలా బయపడుదున్
ఆత్మతో సత్యము తో ఆరాదించెద నా యేసుని ||2||
||తంభురతో||

చాలునయా.. చాలునయా...

పల్లవి:
చాలునయా.. చాలునయా...
నీ కృప నాకు చాలునయా ||2||
ప్రేమమయుడివై ప్రేమించావు కరుణామయుడివై కరుణించావు ||2||
తల్లిగా లాలించి తండ్రిగా ప్రేమించే ||2||
ప్రేమా కరుణా నీ కృప చాలు ||2||
||చాలునయా||

చరణం:
జిగట గల ఊభిలో పడియుండగా
నా అడుగులు స్థిరపరచి నిలిపితివయ్యా ||జిగట||
ఇస్సోకుతో నన్ను కడుగుము ఏసయ్యా
హిమముకంటేను తెల్లగా మార్చయ్యా
నీకేమి చెల్లింతూ నా మంచి మెస్సయ్యా
నా జీవితమంతా అర్పింతు నీకయ్యా
ప్రేమా కరుణా నీ కృప చాలు ||2||
||చాలునయా||

చరణం:
బంధువులు స్నేహితులు త్రోసేసిన
తల్లిదండ్రులే నన్ను వెలివేసిన ||బంధువులు||
నన్ను నీవు విడువనేలేడయ్య
మిన్నగా ప్రేమించి రక్షించినావయ్యా
నీకేమి చెల్లింతూ నా మంచి మెస్సయ్యా
నీ సాక్షిగా నేను ఇలా జీవింతునయ్యా
ప్రేమా కరుణా నీ కృప చాలు ||2||
||చాలునయా||

Sunday, December 7, 2008

పగలైనా రేయైనా...

పల్లవి:
హల్లెలూయ హల్లెలూయ... హల్లెలూయ హల్లెలూయ...
||2||
పగలైనా రేయైనా...
నీ ధ్యానమే నా జీవనము...
||2||

చరణం:
పాపిని ప్రేమతో పిలచిన దేవా...
పావనాత్మ నిను ప్రణుతించెదను...
||2||

పరముడ నిను నే కీర్తించెదను...
||2||
పరలోక భాగ్యము మా కొసగు దేవ...
||పగలైన||

చరణం:
నిరాకడ నా సౌభాగ్యమనీ...
నిరీక్షణతో ఇలా జీవించెదా...
||2||

నా రక్షక నీ అడుగుజాడలో...
నే నడువ నీ భాగ్యము మాకోసగు దేవా...
||2||
||పగలైన||